Tuesday, May 19, 2026
E-PAPER
Homeఖమ్మంబచ్చువారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు 

బచ్చువారిగూడెంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని శాస్త్రవేత్తలు సూచించారు. మండలంలోని బచ్చువారిగూడెంలో మంగళవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో “రైతు ముఖాముఖి – శాస్త్రవేత్తల శిక్షణ కార్యక్రమం” నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రాం ఇన్‌చార్జి శాస్త్రవేత్తలు డాక్టర్ బి.జాంబుమ్మ, డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ యూరియా వినియోగాన్ని తగ్గించుకోవాలని, సాగు ఖర్చులను నియంత్రించాలని, భూసారాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన మేరకే రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించాలని తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ నీటి వినియోగంలో మితవాదం పాటించాలని, నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పంట మార్పిడి విధానాలను అనుసరించడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని వివరించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.

స్థానిక సర్పంచ్ జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శాస్త్రవేత్తలు సూచించిన అంశాలను రైతులు ఆచరణలో పెట్టి సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ఆదాయం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎ.చిన్నసోమ, వ్యవసాయ విస్తరణాధికారి ఎస్.కె.షకీరా భాను, పలువురు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -