Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అరెస్టు

లంబాడ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అరెస్టు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గుల్లా తాండాకు చెందిన ఎల్ హెచ్ పిఎస్ మండల అధ్యక్షునికి మగళవారం రోజు ఉదయం 5:30 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26న జరగబోయే లంబాడా హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా ముందస్తుగా అరెస్ట్ చేశారని నాయకులు తెలిపారు. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు అన్నారు.  అనిల్ కుమార్ రాథోడ్ ను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వారు మండిపడ్డారు. ఇది కేవలం మా సమాజాన్ని అణిచివేయడనికి చేస్తున్న ప్రయత్నమే అని వారు విమర్శించారు. వెంటనే మండల అధ్యక్షుడు అనిల్ రాథోడ్ ను విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -