Tuesday, May 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏప్సెట్ పరీక్షలో మెరిసిన తాడిచర్ల కళాశాల విద్యార్థులు

ఏప్సెట్ పరీక్షలో మెరిసిన తాడిచర్ల కళాశాల విద్యార్థులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఏప్సెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలలో మండల కేంద్రమైన తాడిచెర్ల  ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పూర్తయిన విద్యార్థులు బైపిసిలో ఐదుగురు ఎంపిసిలో ఐదుగురు మంచి ర్యాంకులతో అర్హత సాధించారు. విజయం పొందిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి విజయ దేవి, అధ్యాపకులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాలలో చదివి ఏప్సెట్లో  అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్,అగ్రికల్చర్,ఫార్మసీ కోర్సుల్లో ఉచిత బోధన అందిస్తారని తెలిపారు.పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులు అందరు కూడా తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాలని కోరారు దీనిలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా ఎంసెట్ మరియు  నీట్ కోచింగ్ ఇస్తున్నాయన్నారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -