నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం యువజన వారోత్సవాలు ఎంపిడిఓ క్రాoతి కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైయ్యాయి.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బండి స్వామి,తహసీల్దార్ రవికుమార్, తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్,ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు,కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి హాజరై 2కె రన్ ప్రారంభించారు. 23 వరకు ‘యువజన క్రీడల వారోత్సవాలు’ నిర్వహించనున్నట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా యువతలో శారీరక దృఢత్వం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతాభావం, యువశక్తి వికా సం, ఉపాధి అవకాశాలపై అవగాహన పెంపొందిం చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఆరు రోజులపాటు జరిగే ఈ యువజన, క్రీడల కార్యక్రమాలను రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో యువజన సంఘాలు, క్రీడాకారులు, విద్యార్థులు, వలంటీర్లు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు.
19న కెరీర్, స్కిల్ డెవలప్మెంట్ డే సందర్భంగా నైపుణ్యాభివృద్ధి కోర్సులు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అవకాశాలు, స్కిల్ యూనివర్సిటీ కార్యక్ర మాలు, అగ్నివీర్ నియామకాలపై అవగాహన కల్పించనున్నారు. 20న యువతలో నాయకత్వ లక్షణాలు, వినూ త్న ఆలోచనలు, పౌర అవగాహన పెంపొందించేం దుకు ‘యూత్ లీడర్షిప్ సమ్మిత్’ కార్యక్రమం నిర్వ హించనున్నారు. మెయిన్ స్టేడియంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సామా జిక, అభివృద్ధి అంశాలపై, యూత్ పార్లమెంట్ సమావేశాలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నారు.
21న ప్లే, పార్టిసిపేట్- స్పోర్ట్స్ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల ఆధ్వర్యంలో మెయిన్ స్టేడి యంలో అథ్లెటిక్స్, కబడ్డీ, బాస్కెట్బాల్,వాలీ బాల్,ఫుట్బాల్, హ్యాండ్బాల్ పోటీలు ఉంటాయి.22న సర్వ్, సపోర్టు తెలంగాణ- క్లీన్ తెలంగా ణలో భాగంగా స్వచ్ఛ క్రీడల మైదానాల్లో, అన్ని మండల కేంద్రాల్లో యువ వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, క్రీడాకారులు పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతారు.23న ఉద్యోగ సాధన- అవకాశాలతో ప్రతిభను అనుసంధానం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.



