ధరల పెరుగుదలతో పచ్చడి ప్రియం
ఇతర సామగ్రి ధరతో బెంబేలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని తాడిచెర్ల,కాపురం,రుద్రారం,పెద్దతూoడ్ల గ్రామాల్లో దాదాపు 300 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి.200 ఎకరాల మామిడి తోటలు ఓసిపి బ్లాక్-1లో కోల్పోయాయి.ఉన్న కాస్తోకూస్తో టోటలు వాతావరణ ప్రతికూల పరిస్థితులకు తోడు చీడపీడలు ఆశించడంతో ఈ ఏడాది మామిడి దిగుబడి పడిపోయింది.దీంతో మే నెల రాగానే పచ్చడి కాయలతో పాటు ఇతర రకాల అమ్మకాలు జోరందుకోవాల్సి ఉన్నా ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు.పలు కారణాలతో పచ్చడి పెట్టుకునే రకాలు మార్కెట్లో అరకొరగానే లభిస్తున్నాయి. చిన్న రసాలు,పెద్ద రసాలు,జలాలు,తెల్లగులాబీ వంటి రకాలను పచ్చడి తయారీకి ఉపయోగిస్తారు.కానీ, కొరత కారణంగా ఒక్కో కాయ రకాల ఆధారంగా రూ.20 నుంచి రూ.30కి పైగా ధర పలుకుతోంది. దీనికి ఇతర సామగ్రి ధరలు కూడా పెరగడంతో జనం పచ్చడి పెట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు.
తెగుళ్ల బెడదతో
మామిడి సీజన్ ప్రారంభంలో తేనెమంచు పురుగు ఆశించి పూత రాలిపోయింది. కొన్ని చెట్లకు పలుచగా కాయలు కాసినా వాటికి మంగు రావడంతో పాటు పండు ఈగ పురుగు ఆశించింది.దీంతో దిగుబడిపై ప్రభావం పడింది. గతంలో ఒక్కో చిన్న రసం, పెద్ద రసం చెట్టుకు వేయికిపైగా కాయలు కాసేవి. కానీ ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల నేప థ్యాన కొన్ని చెట్లు కాయలే కాయకపోగా మరికొన్నిచెట్లకు పలుచగా ఉన్నాయి. మంగు వచ్చిన మామి డికాయలు పచ్చడికి పనికి రాకపోవడంతో ఉన్న కొద్దిపాటి కాయలకు డిమాండ్ పెరిగిది.భూపాలపల్లి,మంథని, కాటారం,గోదావరిఖని ప్రాంతాల నుంచి చిరువ్యాపారులు పచ్చడి మామిడి,పండ్ల విక్రయాలకు టోటలను గుత్తాలకు పట్టారు.



