నవతెలంగాణ-వర్ధన్నపేట
గ్రామ అభివృద్ధితో పాటు ఇందిరమ్మ ఇండ్ల మంజూరిపై నల్లబెల్లి గ్రామ సర్పంచి జక్కి అనిత శ్రీకాంత్ జిల్లా ఇన్చార్జ్, గృహ నిర్మాణశాఖ మంత్రి, శ్రీనివాస్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నల్లబెల్లి గ్రామ అభివృద్ధి, గ్రామ ప్రజల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కలిసినట్లు వారు తెలిపారు. నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్ తెలంగాణ ప్రభుత్వ మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రెండో విడతలో చేపట్టనున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నల్లబెల్లి గ్రామానికి అధిక సంఖ్యలో ఇళ్లు కేటాయించాలని కోరారు. గ్రామంలో అర్హులైన పేద కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నందున ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి నల్లబెల్లి గ్రామ పేద ప్రజల సంక్షేమం కోసం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సహకారాన్ని మరింతగా తీసుకురావడమే లక్ష్యంగా హైదరాబాదులో మంత్రులను కలిసినట్లు వారు తెలిపారు.
మంత్రి పొంగులేటిని కలిసిన నల్లబెల్లి సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



