Tuesday, May 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి 

రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలి 

- Advertisement -

దళిత క్రైస్తవులు ఐకతతో హక్కులు సాధించుకుందాం 
నవతెలంగాణ-మిడ్జిల్ 

1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని, లేదా సవరించాలని మతం మారితే కులం మారదని, మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు సంపత్ కుమార్, విజయ్ కుమార్, అన్నారు. మంగళవారం మండలంలోని వాడియాల గేట్ టి ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో రాజ్యాంగం దళిత క్రైస్తవులు సామాజిక న్యాయం రౌండ్ టేబుల్ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితులు బౌద్ధ ,సిక్కు మతం స్వీకరిస్తే దళితులుగానే ఉంటున్నారని ,క్రైస్తవ మతం స్వీకరిస్తేనే ఎస్సీ హోదా రద్దు అనేది పాలకుల కుట్రని విమర్శించారు. 1950 రాష్ట్రపతి  ఉత్తర్వులు రద్దుచేసి మతం మారిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.

దళిత క్రైస్తవులందరూ ఎస్సీ హోదా సాధించేవరకు ఐకమత్యంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు దళిత క్రైస్తవులను ఓటు బ్యాంకు ఆడుకున్నారే తప్ప వారి హక్కులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారిన దళిత క్రైస్తవులు నేటికి కుల వివక్షతకు  గురి అవుతున్నారని , చర్చిల పైన పాస్టర్ల పైన దళిత క్రైస్తవులపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జూన్ 9 లోపు బాలకృష్ణ కమిషన్ నివేదిక వస్తుందని నివేదిక కంటే ముందే దళిత క్రైస్తవులు, ఒక చేతిలో రాజ్యాంగాన్ని మరో చేతిలో బైబిల్ ను పట్టుకొని రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపాలని పిలుపునిచ్చారు. కమిషన్ ముందే దళిత క్రైస్తవులు ఐకంగా వారు ఎదుర్కొంటున్న కులవ్యక్షత మీద ఆధారాలు కమిషన్కు నివేదిక రూపంలో అందించాలని కోరారు. దళిత పాస్టర్ లందరూ రాజ్యాధికారం దిశగా ముందుకు సాగాలని, రాబోవు రోజుల్లో దళిత క్రైస్తవుల అందర్నీ ఏకతాటి పైకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాస్టర్లు కొమ్ము జాన్ పాస్టర్, రఘునందన్, దేవదాసు నాయుడు, సువార్త రాజు, పరంజ్యోతి, సంఘ పెద్దలు దానియేలు, సురేందర్, భీమయ్య, జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -