జలమండలి జనరల్ మేనేజర్
అక్రమాస్తులపై ఏసీబీ దాడులు
రూ.1.10 కోట్ల నగదు,2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి, ఇతర ఆస్తులు స్వాధీనం
నవతెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో మరో అవినీతి తిమింగలం బండారాన్ని ఏసీబీ అధికారులు బయటపెట్టారు. మంగళవారం రాష్ట్ర జల మండలి (ప్రాజెక్టులు) జనరల్ మేనేజర్ కుమార్ అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్న కుమార్ ఆస్తులతో పాటు అతని బంధువులు, స్నేహితులు, బినామీల ఇండ్లలోనూ ఏసీబీ సోదాలు కొనసాగాయి. మొత్తం 8 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.50 కోట్లకు పైగానే విలువైన ఆస్తులు, బంగారం, వెండి నగలు, నగదు బయటబడ్డాయి. మల్లాపూర్‌లోని కుమార్ నివాసంపై అవినీతి తిమింగలం ఆస్తులు రూ.50 కోట్లపైనే(మొదటిపేజీ తరువాయి)దయమే దాడి జరిపిన ఎసీబీ బృందం సాయంత్రం వరకు సోదాలు నిర్వహించింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల్లోని కుమార్ స్నేహితులు, బినామీలు, బంధువుల ఇండ్లల్లోనూ 8 టీమ్‌లు సోదాలు నిర్వహించాయి.
ఈ సోదాల్లో కుమార్ నివాసంలోని బీరువాలోంచి ఏకంగా రూ.1.10 కోట్ల నగదు బయటపడింది. అలాగే భారీ మొత్తం బంగారం, వెండి నగలను కూడా ఏసీబీ అధికారులు స్వాధినం చేసుకున్నారు. 2.1 కిలోల బంగారం నగలు, 9.2 కిలోల వెండి నగలను అధికారులు సీజ్ చేశారు. అలాగే నివాసంలో ఒక మారుతీ రిజ్డ్ కారు, రెండు మోటర్ బైక్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. విలువైన ఏడు ఓపెన్ ప్లాట్లు, మరో ఆరు ప్లాట్లు, మరో ఇంటిని కూడా అత్యంత విలువైన ప్రాంతంలో కుమార్ కలిగి ఉన్నట్లు ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువను గణించిన అధికారులు మొత్తం రూ.5,88,55000 విలువైనవిగా గుర్తించారు. వీటి ఓపెన్ మార్కెట్ విలువ రూ.50 కోట్ల రూపాయల పైనే ఉంటుందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారుసిన్హ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నదని నిదితుడు కుమార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఆమె తెలిపారు.
అవినీతి తిమింగలం ఆస్తులు రూ.50 కోట్లపైనే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



