Tuesday, August 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీ సర్కారు నియంతృత్వానికి పరాకాష్ట

బీజేపీ సర్కారు నియంతృత్వానికి పరాకాష్ట

- Advertisement -

రాహుల్‌‌గాంధీ అరెస్టుకు నిరసనగా 
నేడు చలో రాజ్‌‌భవన్‌ : మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

​ప్రతిపక్ష నేత రాహుల్‌‌గాంధీని అరెస్టు చేయడం బీజేపీ సర్కారు నియంతృత్వానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్‌‌కుమార్‌ ‌గౌడ్‌ ‌విమర్శించారు. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీతోపాటు ఎంపీ ప్రియాంక గాంధీ ఇతర ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి జైల్‌‌కు తరలించడం దుర్మార్గమని ఒక ప్రకటనలో విమర్శించారు.
నీట్ పరీక్ష పేపర్ లీకులపై పార్లమెంట్ లో సమగ్రంగా చర్చించాలంటూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం భయపడిందని తెలిపారు. అడ్డగోలు అవినీతి, అక్రమాలపై విచారణ కోరితే, బీజేపీ తోక ముడిచిందని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీతోపాటు ప్రతిపక్ష నేతల అరెస్టులకు నిరసనగా బుధవారం చలో రాజ్ భవన్‌‌కు ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు నెక్లెస్‌ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు ‌పార్టీ శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎత్తున తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -