Wednesday, July 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌నాపై కేసు కొట్టేయండి

‌నాపై కేసు కొట్టేయండి

- Advertisement -

హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్‌
ఉదయ్‌ కృష్ణారెడ్డి పిటిషన్‌
అతని శరీరంలో విషపదార్థాలు లేవని తేల్చిన డాక్టర్లు
నవతెలంగాణ 
ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌ ‌కృష్ణారెడ్డి హైకోర్టులో మంగళవారం పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‌పై విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. తోటి మహిళా ఐపీఎస్‌ అధికారిపై లైంగిక దాడి చేశారనే ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌ ‌కృష్ణారెడ్డిపై అత్తాపూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌‌లో కేసు నమోదైన విషయం విదితమే. మరోవైపు అపర్మాక స్థితిలో తన అన్న ఇంట్లో పడి ఉన్న ఉదయ్‌‌కృష్ణారెడ్డికి స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నది. అతని నుంచి సేకరించిన మూత్రం, రక్తపు నమూనాల్లో విష పదార్థాలు లేవని పరీక్షలో తేలిందని ఆస్పత్రి డాక్టర్లు వెల్లడించారు. అధికంగా మద్యం సేవించిన కారణంగానే అతను స్పృహ కోల్పోయాడని వివరించారు. అయితే, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్‌ ‌నోట్‌ ‌రాయడం వల్ల అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని అతని సోదరుడు, స్నేహితులు భావించారు. అయితే, తాను ఆత్మహత్యాయత్నం చేయలేదనీ, మద్యం సేవించానని ఉదయ్‌‌కృష్ణారెడ్డి డాక్టర్లకు చెప్పినట్టు తెలుస్తున్నది. చికిత్స పూర్తయ్యాక ఉదయ్‌‌కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడానికి అత్తాపూర్‌ ‌పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ‌మరోవైపు ఉదయ్‌‌కృష్ణారెడ్డిపై ఏకపక్షంగా కేసు నమోదు చేసినట్టుగా ఉందని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ‌మన్నెం నాగేశ్వరరావు ట్వీట్‌ ‌చేస్తూ అభిప్రాయపడ్డారు. ఈ కేసు సమగ్రంగా విచారించి ఇద్దరి తప్పు ఉంటే దాని ప్రకారం పాలనాపరమైన చర్యలను తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -