Wednesday, July 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీని సందర్శించిన మిజోరాం స్పీకర్‌

అసెంబ్లీని సందర్శించిన మిజోరాం స్పీకర్‌

- Advertisement -

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌తో
ఇరు సభల పనిపద్ధతులపై చర్చ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

మిజోరాం రాష్ట్ర శాసనసభ స్పీకర్ పూలాల్ బిక్జామా మంగళవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభను సందర్శించారు. ఆయనతోపాటు సతీమణి వాన్ లాల్ రుటి కూడా ఉన్నారు. వీరికి స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌ స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్లో వారితో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల శాసనసభలు, స్పీకర్ల బాధ్యతలు, అసెంబ్లీల సమావేశాల నిర్వాహణ, పనితీరు, పద్దతులపై చర్చించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మిజోరాం స్పీకర్‌‌కు సభాపతి ప్రసాద్ కుమార్ వివరించారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ తరపున మిజోరాం స్పీకర్, వారి సతీమణిని శాలువాతో సత్కరించి మెమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి కార్యదర్శి డా. వి నరసింహాచార్యులు‌, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి, లెజిస్లేటివ్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -