- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ నార్వే పర్యటన సందర్భంగా అక్కడి స్థానిక మీడియా వ్యవహరిస్తున్న తీరు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన దుమారానికి దారితీస్తోంది. మంగళవారం నార్వేకు చెందిన అతిపెద్ద దినపత్రిక ‘ఆఫ్టెన్‌పోస్టెన్’ ప్రధాని మోడీని ‘పాములు పట్టే వ్యక్తి’లా చిత్రీకరిస్తూ, పెట్రోల్ పైపును పాములా చూపిస్తూ, పూరక ఊదుతున్నట్లు వ్యంగ్య చిత్రం ప్రచురించింది. దీనికి ‘ఒక తెలివైన, కానీ కొంచెం చిరాకు తెప్పించే వ్యక్తి’ అనే వివాదాస్పద శీర్షికను కూడా జత చేశారు.
- Advertisement -



