నవతెలంగాణ – నెల్లికుదురు
ఆగివున్న ట్రాక్టర్ ను ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన రామన్న గూడెం పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్న గూడెకు చెందిన చందుపాక జంపయ్య(25), చందపాక రామకృష్ణ, బుర్ర యాకుబ్ పాషాలు పని నిమిత్తం నెల్లికుదురుకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో పెద్ద చెరువు కట్టమీద ఆగివున్న ట్రాక్టర్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పదించిన స్థానికులు క్షతగాత్రులను మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ జంపన్న ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ యజమానిపై మృతుని అన్న చందుపాక రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
ఆగివున్న ట్రాక్టర్ ను ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



