Wednesday, May 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఎడ్ బిడ్ లో అగ్ని ప్రమాదం     

ఎడ్ బిడ్ లో అగ్ని ప్రమాదం     

- Advertisement -

ఫైర్ ఇంజన్ ఆలస్యంగా రావడంతో సహాయక చర్యలో ఎస్సై
నవతెలంగాణ – ముధోల్‌
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాద జరిగింది. అయితే  భైంసా సబ్ డివిజన్ లో ఏకైక ఫైర్ స్టేషన్ బైంసాలోని ఉంది. అయితే సబ్ డివిజన్ లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు ఏకకాలంలో చోటు చేసుకున్నా గ్రామానికి ఫైర్ ఇంజన్ రాలేదు. అప్పటికి సమాచారం అందుకున్న ముధోల్  ఎస్సై బిట్ల పెర్సిస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు మంటలను ఆర్పి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎస్ఐ కూడా గ్రామస్తులతో కలిసి సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు.

గ్రామ శివారులో ఓ రైతు తన పంట చేన్లో అగ్గి పెట్టాడు. అయితే అది క్షణాల్లో పక్కనే ఉన్న చంద్ర గౌడ్ కు చెందిన షెడ్ లో ఉన్న పశుగ్రాసానికి అంటుకుంది. చుట్టుపక్కల పశువుల పాకలు, జనవాసాలు ఉండటంతో కొంత ఆందోళన చోటు చేసుకుంది. ఫైర్ ఇంజన్ రాకపోవడంతో గ్రామస్తులు జనవాసాల్లో ఉన్న బోరు బావుల ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన మధ్యాహ్న జరిగినప్పటికీ మంటలు మాత్రం సాయంత్రం వరకు అదుపులోకి రాలేదు. ఎట్టకేలకు ఖానాపురం నుండి ఫైర్ ఇంజన్ రావడంతో మంటలను చుట్టుపక్కల వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -