Wednesday, May 20, 2026
E-PAPER
Homeజాతీయంజూన్ 21న నీట్ ఎగ్జామ్‌..కేంద్ర విద్యాశాఖ మంత్రి కీల‌క‌ సమీక్ష‌

జూన్ 21న నీట్ ఎగ్జామ్‌..కేంద్ర విద్యాశాఖ మంత్రి కీల‌క‌ సమీక్ష‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మంద్ర ప‌ర్దాన్ ఆధ్వ‌ర్యంలో కీల‌క‌ స‌మావేశం నిర్వ‌హించారు. వ‌చ్చే నెల జూన్ 21న నిర్వ‌హించ‌నున్న నీట్-యూజీ ఎగ్జామ్‌పై కేంద్ర నిఘా సంస్థ‌ల అధికారుల‌తో పాటు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులతో భేటీ అయ్యారు. త‌దుప‌రి ప‌రీక్ష‌లో ఎలాంటి త‌ప్పిదాలు జ‌ర‌గ‌కూడ‌ద‌ని, ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తతోపాటు పేప‌ర్ లీక్ కాకుండా నిఘా సంస్థ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

మెటా, గూగుల్, టెలిగ్రామ్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ప్రతినిధులతో జరిగిన సమాంతర సమావేశంలో, ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానెళ్లు మరియు అనామక ఆన్‌లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండ ముంద‌స్తు చర్య‌లపై స‌మీక్ష చేప‌ట్టారు.

కాగా,ఈనెల‌ మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను మే 12న ఎన్‌టీఏ రద్దు చేసిన విష‌యం తెలిసిందే. దేశంలో 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో, 5,400కు పైగా కేంద్రాలలో 22 లక్షలకు పైగా అభ్యర్థులు నీట్ ప‌రీక్ష రాశారు.కానీ రాజస్థాన్‌లో పేప‌ర్ లీక్ కావ‌డంతో నీట్ పరీక్ష‌ను ర‌ద్దు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -