Thursday, May 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిన్యాయం దూరమవుతోందా?

న్యాయం దూరమవుతోందా?

- Advertisement -

భారత ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరూ సమానులని రాజ్యాంగం చెబుతుంది. కానీ వాస్తవం దీనికి భిన్నం. రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు చట్టాన్ని తమకు అనుకూలంగా ప్రభావితం చేసుకుని, సామాన్య ప్రజలకు న్యాయం లభించకుండా చేస్తున్న ప్రయత్నాల తీరు రోజురోజుకూ సర్వ సాధారణంగా మారుతోంది. ఇది కేవలం ఒక్క పార్టీ లేదా ఒక్క రాష్ట్ర సమస్య కాదు – వామపక్ష‍ాలు మినహా దాదాపు అన్ని పార్టీలు, అన్ని స్థాయిల్లో కనిపించే వ్యవస్థాగత సమస్య. ప్రధాన యంత్రాం గాలైన పోలీసు, న్యాయవ్యవస్థ, సిబిఐ, ఈడి వంటి ఏజెన్సీలపై రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కేసులు నమో దు చేయడం, దర్యాప్తు మార్చడం, ఛార్జ్‌షీట్ ఫైల్ చేయడం లేదా మూసివేయడం – ఇవన్నీ ఎన్ని కల ఫలితాలు, కూటమి సమీ కరణాలపై ఆధారపడతాయి. ఒక నాయకుడు అధికారంలో ఉన్న ప్పుడు వ్యతిరేక పార్టీ నాయకులపై ఎన్నికల సమయంలో కేసులు నమోదవుతాయి. అధికారం మారగానే ఆ కేసులు నెమ్మదిగా మరుగున పడటం, కాదంటే ఎదురు కేసులు కావటం షరా మాములు అన్నట్లుగా మారింది. ఇది చట్టపాలనకు తీవ్రమైన హాని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో మరింత దారుణం. కొన్ని రాజకీయ కుటుంబాల్లో భర్త, భార్య, కుమారులు, కుమార్తెలు – అందరూ వ్యాపారాలు, ల్యాండ్ డీల్స్, మైనింగ్, లిక్కర్ స్కామ్‌లలో ప్రముఖ పాత్ర పోషిస్తూ, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదిస్తున్నా, చట్టం వారిని తాకడం లేదు.

అనేక అక్రమాలు, కుంభకోణాల్లో పేరు వినిపించిన వారి కేసులు సుదీర్ఘ కాలం కోర్టుల్లో పెండింగ్‌లో ఉండి, చివరికి బెయిల్‌లు, స్టే ఆర్డర్లతో కొనసాగు తున్నాయి. సామాన్యుడు ఒక్క చిన్న కేసులో కూడా జైలు శిక్ష అనుభవిస్తే, ఈ ప్రముఖులు సంవత్సరాల తరబడి బయట తిరుగుతూ, ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. న్యాయవ్యవస్థ లోని జాప్యం ఇక్కడ కీలకం. కేసులు దశాబ్దాలు నడుస్తాయి. రాజకీయ ప్రభావం ఉన్నవారి కేసుల్లో సాక్షాలు మారతాయి, ఆధారాలు అదృశ్యమవుతాయి, జడ్జిల బది లీలు జరుగుతాయి. సుప్రీం కోర్టు, హైకోర్టు లు కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తిడిని సూచించాయి. పోలీసు యంత్రాం గం పూర్తిగా రాజకీయ నియంత్రణలో ఉండటం వల్ల సామాన్యుడికి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకోవడమే భారమవు తున్నదనేది ఇటీవల జరిగిన ఓ ఫిర్యాదుదారు విషయంలో తేటతెల్లమైంది. తన కూతురిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసేందుకు వెళ్తే, ఆరు గంటల పాటు తాత్సారం చేశారనే బాలిక తల్లి చేసిన ఆరోపణ ఇందుకు నిదర్శనంగా పలువురు భావిస్తున్నారు. ఎదుటివారు రాజకీయ నాయకుడి బంధువైతే, కేసు ముందుకు సాగడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సామాన్య ప్రజల్లో చట్టం పట్ల నమ్మకం కోల్పోతుండగా, “చట్టం బలవంతుల కోసమే” అనే అభిప్రాయం వ్యాప్తి చెందు తోంది.

ఇది దీర్ఘకాలికంగా సమాజ స్థిరత్వా నికి ముప్పుగా మారి భ్రష్టాచారం, అక్రమా లు పెరిగి, ఆర్థిక అసమానతలు పెరుగు తాయనే భావన వ్యక్తమవుతున్నది. రాజకీయ కుటుంబాల ఆస్తులు పెరుగుతున్నంత సేపు ప్రజలు పేదరికం, న్యాయ లోపం నుంచి బయటపడలేరనేది గమనించాల్సిన అవసర మున్నదనే చర్చ ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగుతుండటం గమనార్హం. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెచ్చి స్వతంత్ర పోలీసు కమిషన్ ఏర్పాటు చేయడంతో, రాజకీయజోక్యం తగ్గి పారదర్శకంగా సేవలు అందే అవకాశముంటుంది. న్యాయవ్యవస్థలో డిజిటల్ ట్రాన్స్‌ప రెన్సీకి అవకాశం కల్పిస్తే, వేగవంతమైన విచారణతో కేసులు ముగిసే అవకాశాలుం టాయి. స్వతంత్ర ఏజెన్సీలైన సిబిఐ, ఈడీ లు స్వయం సమృద్ధి దిశగా సాగేందుకు చొరవ చూపాలి. రాజకీయ నాయకుల ఆస్తులు, కుటుంబ వ్యాపారాలపై స్వతంత్ర ఆడిట్ ఏర్పాటు చేసి, చట్టం ముందు అందరూ సమానులనే సూత్రం కేవలం పుస్తకాల్లోనే కాకుండా వాస్తవంలో కూడా అమలయ్యేలా కృషి చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యం కేవలం పేరుకు మాత్రమే మిగిలిపోతుంది. సామా న్యుడు న్యాయం కోసం ఎదురు చూస్తూ, బలవంతులు చట్టాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నంత కాలం దేశం నిజమైన పురోగతి సాధించలేదు.
ఇ.సంజీవరెడ్డి, 9948639636

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -