న్యూఢిల్లీ : దేశంలోని ఎనిమిది కీలక మౌలిక వసతుల రంగాల వృద్ధి అంతంత మాత్రంగానే నమోదయ్యింది. బుధవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్ నెలలో కీలక రంగాల ఉత్పత్తి 1.7 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. మొత్తం పార్రిశామిక ఉత్పత్తి సూచీలో 40.27 శాతం వాటా కలిగిన ఈ రంగాలు మార్చి నెలలో 1.2 శాతంగా నమోదయ్యింది. ఈ ఎనిమిది రంగాలలో ఏప్రిల్ నెలలో సిమెంట్ ఉత్పత్తి అత్యధికంగా 9.4 శాతం వృద్ధిని సాధించగా, స్టీల్ ఉత్పత్తి 6.2 శాతం, విద్యుత్ ఉత్పత్తి 4.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే, ఇంధన, కమోడిటీ రంగాలలోని బలహీనత వల్ల మిగిలిన ఐదు రంగాలు క్షీణతను చవిచూశాయి. ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తి 8.7 శాతం, ఎరువులు 8.6 శాతం, సహజ వాయువు 4.3 శాతం, ముడి చమురు 3.9 శాతం, పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు 0.5 శాతం చొప్పున పడిపోయాయి.
పేలవంగానే కీలక రంగాల ఉత్పత్తి
- Advertisement -
- Advertisement -



