Thursday, May 21, 2026
E-PAPER
Homeజాతీయంభారీ అగ్నిప్రమాదం..ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి

భారీ అగ్నిప్రమాదం..ఇద్దరు ఫైర్ సిబ్బంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మహరాష్ట్రలోని థానే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఓ మార్కెట్ కాంప్లెక్స్ లో గురువారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. ఒక ఫైర్ మ్యాన్, ఒక సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. మే 21 గురువారం తెల్లవారుజామున సుమారు 3.45 గంటల సమయంలో గమ్ దేవి మార్కెట్ కాంప్లెక్సులో మంటలు చెలరేగాయి. అక్కడ పెద్దసంఖ్యలో కూరగాయలు, బట్టల దుకాణాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదం తీవ్రత దృష్ట్యా అగ్నిమాపకశాఖ బ్రిగేడ్ కాల్ ప్రకటించింది. మార్కెట్ నుండి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు రావడం చూసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిప్రమాదం కారణంగా మార్కెట్ కాంప్లెక్స్ పూర్తిగా ధ్వంసమైందని అదనపు పోలీస్ కమిషనర్ ప్రశాంత్ రోడే మీడియాతో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రమాదస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వచ్చిన ఫైరింజన్లు, RDMC బృందాలు మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి. కాగా.. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -