Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశ అభివృద్ధి కోసం మార్గం చూపిన వ్యక్తి రాజీవ్ గాంధీ

దేశ అభివృద్ధి కోసం మార్గం చూపిన వ్యక్తి రాజీవ్ గాంధీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్న కాలంలో దేశ అభివృద్ధి కోసం చూపిన మార్గం ఆదర్శమని మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. రాజీవ్ గాంధీ చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ గురూజీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుమంత్ యాదవ్, మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, చిన్న షక్కర్గ గ్రామ సర్పంచ్ దిగంబర్, హెచ్ కేలూరు సర్పంచ్ లక్ష్మణ్, టౌన్ అధ్యక్షులు బండి గోపి, నాయకులు సంఘయప్ప, కృష్ణ పటేల్, కర్ల సాయిలు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -