నవతెలంగాణ – ఆలేరు రూరల్ : జలగం జనార్దన్ (జెన్ను సార్) 5వ వర్ధంతి సందర్భంగా ఆలేరు మండలం మందనపల్లిలో నిర్వహించిన సభలో సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.గోవర్ధన్ నివాళులర్పించారు.జెన్ను సార్ సమసమాజ స్థాపన కోసం జీవితాంతం పోరాడిన విప్లవ నేత అని కొనియాడారు.14 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి పార్టీ బలోపేతానికి కృషి చేశారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న అసమానతలు, కుల-మత విద్వేష రాజకీయాలను ఎదుర్కోవాలంటే బలమైన ప్రజా ఉద్యమాలు అవసరమని, ప్రజల సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు, విప్లవకారులు పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర అధ్యక్షులు ఎం.భిక్షపతి, సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, ప్రజా సంఘాల నాయకులు కళ్లెపు అడివయ్య, ఆర్.సీత, మందనపల్లి ఉప సర్పంచ్ పద్మ శశిరేఖ, బేజాడి కుమార్, ఇక్కిరి సహదేవ్, తమ్మడి మాధవి, తమ్మడి ఉమా పలువురు ప్రజా సంఘాల నాయకులు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతిఘటన పోరాటయోధుడు జలగం జనార్దన్కు విప్లవ జోహార్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



