నవతెలంగాణ – తుంగతుర్తి : ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలని,మిల్లుల వద్ద తరుగు,కోతలు లేకుండా ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల పరిధిలోని రావులపల్లి,వెంపటి గ్రామాలలోని ఐకెపి కేంద్రాల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. మిల్లులకు చేరిన లారీలు రోజులు గడిచిన అన్లోడ్ చేయడం లేదని కింటాకు మూడు కేజీల చొప్పున తరుగు తీస్తున్నారని,అధికారులకు చెప్పిన స్పందన లేదని అన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్నందున వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు చింతకుంట్ల మనోజ్,ఎల్లయ్య,తునికి సాయిలు,మాజీ సర్పంచ్లు లకావత్ యాకు నాయక్, నాగయ్య,పార్టీ కార్యకర్తలు ప్రసాద్, సురేష్, భాస్కర్, వెంకన్న, భిక్షం, వీరస్వామి, నరసయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి: తాటికొండ సీతయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



