Saturday, May 23, 2026
E-PAPER
Homeఆటలుకాసుల వర్షం కురిసేనా?

కాసుల వర్షం కురిసేనా?

- Advertisement -

టీజీ20 ప్రాంఛైజీల వేలం నేడు
నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ టీ20 లీగ్‌ (‌టీజీ20) ప్రాంఛైజీలు దక్కించుకునేందుకు బడా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈఓఐ)ను సుమారు 67 కంపెనీలు కొనుగోలు చేయగా.. సమగ్ర పరిశీలన అనంతరం 42 కంపెనీలకు బిడ్‌ ‌దాఖలు చేసే అర్హత ఉందని తేల్చారు. ఇందులో సుమారు 16 కంపెనీలు ప్రాంఛైజీలు దక్కించుకునేందుకు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడుతున్నాయి. దీంతో టీజీ20తో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (‌హెచ్‌‌సీఏ) ఖజానా నింపుకోనుంది. నేడు హైదరాబాద్‌‌లోని ఓ హోటల్‌‌లో ప్రాంఛైజీల వేలం జరుగనుంది. 8 ప్రాంఛైజీల కోసం కంపెనీలు బిడ్లు దాఖలు చేయనున్నాయి. హైదరాబాద్‌ ‌సహా పది జిల్లాలతో కూడిన పేర్లను హెచ్‌‌సీఏ ప్రాంఛైజీలకు అందుబాటులో ఉంచింది. అత్యధిక బిడ్‌ ‌దాఖలు చేసిన ప్రాంఛైజీలకు వరుస క్రమంలో జట్ల పేర్లను ఎంచుకునే అవకాశం ఇవ్వనున్నారు.

​ప్రాంఛైజీకి రూ.6-8 కోట్లు?
టీజీ20 ప్రాంఛైజీకి కనీస ధర రూ. 3 కోట్లు కాగా, జిఎస్టీ అదనం. ప్రాంఛైజీల కోసం పోటీ ఎక్కువగా ఉండటంతో బిడ్‌ ‌ధర రూ.6-8 కోట్లకు వరకు పలికే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు చెందని రియల్‌ ఎస్టేట్‌ ‌కంపెనీలు, ఫార్మా కంపెనీలు సహా మీడియా సంస్థలు సైతం ప్రాంఛైజీలు కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ ‌ప్రాంఛైజీలు కైవసం చేసుకునేందుకు రాజకీయ నాయకుల కంపెనీలు ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -