యూత్ ఫర్ క్లీన్ కార్యక్రమంలో శివసేనారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో క్రీడా మైదానాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) కృషి చేస్తుందని ఆ సంస్థ చైర్మెన్ కె. శివసేనారెడ్డి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా వారోత్సవాల్లో శుక్రవారం ‘యూత్ ఫర్ క్లీన్’ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి శాట్జ్ చైర్మెన్ శివసేనారెడ్డి, వీసీ ఎండీ సోనీబాలా దేవి హాజరయ్యారు. క్రీడాకారులు, కోచ్‌లు, సిబ్బందితో కలిసి స్టేడియంను క్లీన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజాభిప్రాయాలను క్రోడీకరించి క్రీడలు, యువజన అభివృద్దికి ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నామని శివసేనా రెడ్డి అన్నారు. ఆరు రోజుల పాటు సాగనున్న క్రీడా వారోత్సవాలు నేటితో ముగియనున్నాయి.
ప్లాస్టిక్ రహిత మైదానాలు!
- Advertisement -
- Advertisement -



