Sunday, May 24, 2026
E-PAPER
Homeఆటలుఢిల్లీ హైకోర్టులో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు ఊరట

ఢిల్లీ హైకోర్టులో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌కు ఊరట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఊరట లభించింది. ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చింది. రెజ్లింగ్ సమాఖ్య ఎంపిక విధానం వివక్షపూరితంగా ఉందని కోర్టు పేర్కొంది. ప్రసూతి విరామం నుంచి తిరిగి వచ్చిన ఫొగాట్ వంటి దిగ్గజ క్రీడాకారిణులను పరిగణనలోకి తీసుకునే విచక్షణాధికారం సమాఖ్యకు లేకుండా పోయిందని వ్యాఖ్యానించింది. ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్‌ను వీడియో రికార్డ్ చేయాలని, SAI, IOA నుంచి ఇద్దరు స్వతంత్ర పరిశీలకులు హాజరు కావాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -