Friday, July 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలునీట్ వివాదంపై గళమెత్తిన దర్శకుడు శేఖర్ కమ్ముల

నీట్ వివాదంపై గళమెత్తిన దర్శకుడు శేఖర్ కమ్ముల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలకు ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలన్న విద్యార్థుల డిమాండ్‌ను ఆయన సమర్థించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల విద్యార్థుల మూడు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. మొదటిది, ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయడం. రెండవది, ఈ వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవడం. మూడవది, భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్‌లు పునరావృతం కాకుండా స్పష్టమైన హామీ ఇవ్వడం. ఏ ప్రభుత్వమైనా పౌరులు అడగకముందే నెరవేర్చాల్సిన కనీస బాధ్యతలు ఇవని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -