- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని బట్లపల్లి గ్రామంలో జరుగుతున్న భూముల “రీ-సర్వే”కార్యక్రమంలో భాగంగా గ్రామ సరిహద్దుల పనులను శుక్రవారం చండూరు ఆర్డీవో శ్రీదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.సర్వే బృందం సర్వే పురోగతిని ఆర్డీవోకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..భూముల రీ- సర్వే తో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. రీ- సర్వేలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కచ్చితంగా పకడ్బందీగా నిర్వహించాలని సర్వే బృందానికి సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు,రెవెన్యూ అధికారులు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



