Sunday, May 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థులకు తెలంగాణ తీపి కబురు

విద్యార్థులకు తెలంగాణ తీపి కబురు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులందరికీ ఉదయం పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనుంది. ఈ కొత్త పథకానికి ‘తెలంగాణ బ్రేక్‌ఫాస్ట్’ అని పేరు పెట్టారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ పథకం అమలు కానుంది. ఇకపై మధ్యాహ్న భోజనంతో పాటు జూనియర్ కాలేజీల్లో కూడా భోజన సౌకర్యం విస్తరించనున్నారు. విద్యార్థులకు వారంలో మూడు రోజులు పాలు కూడా అందిస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 20 లక్షలకుపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -