Friday, July 24, 2026
E-PAPER
Homeజాతీయంకాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొననున్న మమతా బెనర్జీ

కాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొననున్న మమతా బెనర్జీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో మరోసారి కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. పోటీ పరీక్షల్లో సంస్కరణలు కోరుతూ యువత చేపట్టిన ఉద్యమానికి ఆమె తన మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా, జూలై 27న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొంటానని శుక్రవారం వెల్లడించారు. ఇదే సమయంలో, లోక్‌సభలో టీఎంసీ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడిగా సీనియర్ నేత సౌగతా రాయ్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. బీర్భూమ్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైన నటి, రాజకీయ నాయకురాలు శతాబ్ది రాయ్ స్థానంలో సౌగతా రాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -