Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలలు ప్రారంభమై 39 రోజులు.. ఏకరూప దుస్తులు ఇచ్చేదెప్పుడో.?

పాఠశాలలు ప్రారంభమై 39 రోజులు.. ఏకరూప దుస్తులు ఇచ్చేదెప్పుడో.?

- Advertisement -

పాత బట్టలతో విద్యార్థుల అవస్థలు
మండలంలో మొత్తం విద్యార్థులు 1468
నవతెలంగాణ – మల్హర్ రావు

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన రోజే విద్యార్థులకు యూనిఫాం అందిస్తామని తొలుత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినా అమలుకు మాత్రం నోచుకోలేదు. పాఠశాలలు ప్రారంభమై 39 రోజులు గడుస్తున్న. సకాలంలో యూనిఫాం అంధక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు సివిల్ డ్రెస్సులు,పాత యూనిఫాంతో తరగతులకు హాజరవుతున్నారు.ఏటా విద్యాసంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు పుస్తకాలతో పాటు యూనిఫాం అందజేసేవారు.ఈసారి వస్ర్తాల కొనుగోలులో జరిగిన అలస్యంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం యూనిఫాల రంగు, డిజైన్లలో మార్పులు చేసింది.బాలురకు నీలం రంగు చొక్కా..లేత నీలం రంగు నేక్కరు లేదా ప్యాంట్,బాలికలకు లాంగ్ ఫ్రాక్, షర్ట్, తరగతుల వారీగా అందించనుంది.గతంలో ఉన్న ప్యాచ్ వర్క్ ఆలంకరణను తొలగించి సాధారణ నమూనా తయారు చేశారు. కొత్త డిజైన్ ఖరారైనా వస్త్రం సరాఫరా లేక యూనిఫాం విద్యార్థులకు ఎప్పుడు ఆందుతాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.మండలంలో ఒక మోడల్,ఒక కస్తూరిబ్బా,5 జిల్లా పరిషత్,25 ప్రాథమిక,రెండు ప్రాథమికొన్నత, మొత్తం 34 పాఠశాలలున్నాయి.ఇందులో బాలురు 646,బాలికలు 832,మొత్తము 1468 మంది విద్యార్థులున్నారు.ఇందులో ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలోని 240 మందికి మాత్రమే ఒక జత చొప్పున ఏకారుప దుస్తులు ఇచ్చారు.మిగతా 1228 మంది విద్యార్థులకు యూనిపామ్స్ ఇవ్వలేదు.

ఉపాధి కరువు
సాధారణంగా ఏటా మార్చిలోనే విద్యార్థులకు కొలతలు సేకరించి ఏప్రిల్, మే నెలల్లో వస్త్రాన్ని మండల కేంద్రాల ద్వారా మహిళా సంఘాలకు అందిస్తారు.వారు దుస్తులు కుట్టి పాఠశాలలకు ప్రారంభమయ్యేలోపు ప్రధానోపాధ్యాయులకు అప్పగిస్తారు.ఈసారి క్లాత్ సరఫరా లేకపోవడంతో మహిళా సంఘాల సభ్యులకు కూడా ఉపాధి లేకుండా పోయింది.గతేడాది మార్చి, ఏప్రిల్లోనే క్లాత్ అందించి మే చివరి వాటికి కుట్టు పనులు పూర్తి చేయగా ఈసారి ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది మహిళలు పనుల కోసం ఎదురుచూస్తున్నారు.మరోపక్క చాలా మంది విద్యార్థులు పాత యూనిపోలతో నే పాఠశాలలకు వెల్లుతుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాం దెబ్బతించింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి యూనిపామ్స్ అందజేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -