Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి

సర్ ప్రక్రియను వేగవంతం చేయాలి

- Advertisement -

సర్ పరిశీలన మండల ఇన్చార్జ్ పంతకాని సమ్మయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు

సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని మండల ఇంచార్జీ పంథాకాని సమ్మయ్య కోరారు.శుక్రవారంమండలంలోని మల్లారం, చిన్నతుండ్ల, తాడిచెర్ల, కిషన్ రావుపల్లె, అడ్వాలపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్ ప్రక్రియను ప్రతి గ్రామం, ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో వేగవంతంగా సమర్థవంతంగా పూర్తి చేయాలని బిఎల్ఏ, సూపర్వైజర్లకు సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితల రాజయ్య, ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్, మండల సర్పంచ్ పోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ, తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి, పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇందారపు చంద్రయ్య, ఇందారపు ప్రభాకర్, నరేశ్ రావు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -