– అదనపు కలెక్టర్ విక్టర్
నవతెలంగాణ – కామారెడ్డి : మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, లచ్చాపేట గ్రామాలను. అదనపు కలెక్టర్ విక్టర్ ఆదివారం సందర్శించారు. అనంతరం మాచారెడ్డి గ్రామంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీపీసీ కేంద్రాన్ని జిల్లా సహకార అధికారి (డీసీవో)తో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
తదుపరి భిక్కనూర్‌లోని సప్తగిరి పీబీఆర్ ఇండస్ట్రీస్‌ను సందర్శించి మిల్లర్‌తో మాట్లాడి ఎలాంటి ఆలస్యం లేకుండా రోజుకు కనీసం 12 లారీల ధాన్యాన్ని అన్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలు పెరగకుండా మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్శనలో సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.



