Sunday, May 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుధాన్యం కొనుగోలు లేక రోడెక్కిన రైతు..

ధాన్యం కొనుగోలు లేక రోడెక్కిన రైతు..

- Advertisement -

– నెలరోజుల నుండి కల్లాల్లోనే రైతులు 
– లారీల కొరతతో తరలని ధాన్యం 
నవతెలంగాణ-రామారెడ్డి 
: ఆరుకాలం కష్టించి పండించిన పంట కొనుగోలు కేంద్రాలకు తరలించిన, నెలరోజులు అయినా, ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్ ఎక్కారు. మండలంలోని అన్నారం గ్రామంలో ఆదివారం పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసి వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. గతంలో హమాలి కొరత, నేడు లారీల కొరతతో రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 నుండి 15 రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానునందున, ధాన్యం తడిసే అవకాశం ఉందని, వర్షాకాలం పెట్టుబడికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, వరి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తరలించి, రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, నాయకులు స్థానిక ఎమ్మెల్యే వెంకట్ రమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో కొనుగోలు జాప్యం జరగకుండా చూస్తామని చెప్పడంతో రైతులు ధర్నా  విరమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -