Wednesday, June 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల కాంగ్రెస్ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కర్కా ఉమశంకర్ ఎన్నిక

మండల కాంగ్రెస్ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కర్కా ఉమశంకర్ ఎన్నిక

- Advertisement -


నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ పంచాయతీ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా అంకుసాపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శ్రీ కర్కా ఉమశంకర్‌ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో ఉప సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఉప సర్పంచుల మధ్య సమన్వయం పెంపొందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ దుద్దిళ్ల శ్రీను బాబు గారి సూచనల మేరకు శ్రీ కర్కా ఉమశంకర్‌ను అధికారికంగా కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందని నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ కర్కా ఉమశంకర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, మండలంలోని ఉప సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, గ్రామాల సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -