లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’ సినిమాతో త్వరలోనే మన ముందుకు వస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందుతున్న సినిమా ఇది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ‘సింగ్ గీతం’ టీజర్, ‘హలో బాసు’ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆదివారం మేకర్స్ మీట్ అవర్ వైజాగ్ హీరో ఈవెంట్ నిర్వహించారు. హీరో అయాన్ మాట్లాడుతూ,’నా పేరు అయాన్. మాది వైజాగ్. అక్కయ్యపాలెంలో పెరిగాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లి తెలుగు సినిమాలో హీరోగా నటించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఇది నా తొలి చిత్రం. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం.
అన్ని వయసుల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు భారతీయ సినీ పరిశ్రమలో ఎవరూ సినిమా చేయలేదు. అలాంటి ప్రత్యేకమైన చిత్రానికి నేను హీరో అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇది నాకు నిజంగా ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్అని తెలిపారు. 'ఈ సినిమాలో నేను గౌరీ పాత్రను పోషిస్తున్నాను. మాది పుదుచ్చేరి. వైజాగ్ చూస్తుంటే నాకు పాండిచ్చేరి గుర్తొస్తుంది. వైజయంతి మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయడం ప్రతి నటుడి కల. ఈ సినిమాతో నా ఆ కల నెరవేరింది అని అహల్యా బమ్రూ చెప్పారు. శాలిని కొండేపూడి మాట్లాడుతూ,’ఈ సినిమాలో నేను రేణు పాత్రలో కనిపించబోతున్నాను. ఇది చాలా కొత్తగా, ప్రత్యేకంగా ఉండే పాత్ర. ఇలాంటి విలన్ పాత్రను మీరు ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చూసి ఉండరు. మా ఇంట్లో వాళ్లు నన్ను చూసి ‘నీలాంబరి తర్వాత నువ్వే’ అని సరదాగా అంటుంటారు (నవ్వుతూ). సింగీతం శ్రీనివాసరావు సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జూన్ 11న సినిమా విడుదల కానుంది. తప్పకుండా అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను` అని అన్నారు.
‘సింగ్ గీతం’ లాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదు
- Advertisement -
- Advertisement -



