Wednesday, June 10, 2026
E-PAPER
Homeజాతీయంఅభిజీత్ దీప్కే, కిరణ్ రిజిజు మధ్యసోషల్ మీడియా వార్

అభిజీత్ దీప్కే, కిరణ్ రిజిజు మధ్యసోషల్ మీడియా వార్

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. సీజేపీ ఇన్‌స్టా పేజ్ ప్రారంభించిన ఐదు రోజుల్లోనే రెండు కోట్లకు పైగా ఫాలోవర్లు చేరారు. అయితే, సీజేపీ ఫాలోవర్లను ఉద్దేశించి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వారిని పాకిస్తాన్, జార్జ్ సోరోస్‌కు చెందిన వర్గాలుగా పేర్కొన్నారు. దీనిపై అభిజీత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. తన ఖాతా హ్యాక్ కావడానికి ముందు ఫాలోవర్ల భౌగోళిక వివరాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. అందుకు సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్‌ను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వివరాల ప్రకారం, 94 శాతానికి పైగా ఫాలోవర్లు భారతదేశానికి చెందినవారేనని అభిజీత్ తెలిపారు. ‘భారత యువతను పాకిస్తానీయులుగా కేంద్ర మంత్రి ఎందుకు ముద్ర వేస్తున్నారు?’ అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దీనికి స్పందనగా మంత్రి మరో పోస్టు చేశారు. ‘పాకిస్తాన్, జార్జ్ సోరోస్ వర్గాల నుంచి సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించుకోవాలనుకునే వారిపై నాకు జాలి వేస్తోంది. భారతదేశంలో తగినంత జనాభా, అత్యంత చురుకైన యువత ఉన్నారు. వారు నిజమైన, విలువైన అనుచరులుగా ఉండగలరు. గుర్తింపు కోసం దేశ వ్యతిరేక శక్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు’ అన్నారు. కాగా, ప్రస్తుతం భారత్‌లో సీజేపీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేయబడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -