నవతెలంగాణ-కాటారం : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే TGPOLYCET–2026 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. కౌన్సిలింగ్ ప్రక్రియ మే 27 నుంచి ప్రారంభం కానుంది.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ తదితర ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొదటి దశ కౌన్సిలింగ్ మే 27 నుంచి జూన్ 9 వరకు, ఫైనల్ ఫేజ్ జూన్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కాటారం TG POLYCET హెల్ప్ లైన్ సెంటర్‌గా గుర్తించినట్లు ప్రిన్సిపాల్ డా. ఎం. రాజ్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎంట్రీ, సాంకేతిక సహాయం అందుబాటులో ఉంటుందని అయన పేర్కొన్నారు.
“పాలిటెక్నిక్ విద్య ద్వారా విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నైపుణ్య ఆధారిత సాంకేతిక విద్య అందుతుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి” అని ఆయన సూచించారు.



