Monday, May 25, 2026
E-PAPER
Homeమానవిఅందుకే ట్రోల్స్‌‌ను పెద్దగా పట్టించుకోను…

అందుకే ట్రోల్స్‌‌ను పెద్దగా పట్టించుకోను…

- Advertisement -


నిహారిక జైన్… ఇటీవలె కేన్స్‌ రెడ్ కార్పెట్‌పై నడిచిన కంటెంట్‌ క్రియేటర్‌. తన ఇన్‌స్టాగ్రామ్‌లో 83,000 మందికి పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 1.6 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్న తన ప్రేక్షకులకు, ఈ ప్రయాణం గురించిన ప్రతి విషయం తెలియాలని ఆమె కోరుకుంటుంది. కేవలం రెడ్-కార్పెట్ కోసం సిద్ధం చేసిన రూపం మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న తన పోరాటం గురించి కూడా చెప్పాలనుకుంటుంది..

ప్రదర్శనకే ప్రాధాన్యం ఉండే ఈ క్రియేటర్ల ప్రపంచంలో నిహారిక తనకు దగ్గరగా అనిపించే, స్ఫూర్తినిచ్చే కంటెంట్ ద్వారా బలమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ లైఫ్‌స్టైల్ కంటెంట్ క్రియేటర్, ఇన్‌ఫ్లుయెన్సర్, వ్యవస్థాపకురాలు అందరికీ దగ్గరగా అనిపిస్తుంది. క్రియేటర్‌గా మారకముందు నిహారిక ఈ రంగంలో ఐదేండ్లు గడిపింది. రియాలిటీ షోలలో, క్రియేటివ్ బృందాలలో పనిచేస్తూ ఫ్యాషన్ కొరియోగ్రఫీకి సహాయకురాలిగా పనిచేసింది. అది చాలా బిజీగా గడిచిన వృత్తి జీవితం. “కానీ అది నాకు చాలా భారంగా అనిపించింది, అందుకే సొంతంగా ఏదైనా చేయాలనుకున్నాను. టిక్‌టాక్‌లో కంటెంట్ సృష్టించడం మొదలుపెట్టాను. వివిధ సందర్భాలలో, వివిధ రకాల దుస్తులలో, ప్రాప్స్ ఉపయోగించి అమ్మాయిలు ఫొటోలు ఎలా దిగాలో నేర్పించాను. కెమెరా ముందు చాలా మంది ఇబ్బంది పడతారు, అలాంటి వారికి సహాయం చేయాలనుకున్నాను,” అని ఆమె చెబుతుంది.

నిర్ణయాత్మక క్షణాలు
ఆమె చేసిన మొట్టమొదటి వీడియో “చేతులతో ఐదు పోజులు” భారీ విజయం సాధించింది. తర్వాత ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్, లైఫ్‌స్టైల్ వంటి రంగాలకు విస్తరించింది. ప్రతి విస్తరణ ఒక మలుపు కన్నా తన పరిధిని విస్తరించడమే. అప్పటికే ఆమె ఎలాంటిదో మరింతగా చూపించడానికి కెమెరా వెనక్కి వెళ్ళింది. నిహారిక కెరీర్‌లోని నిర్ణయాత్మక క్షణాలు కేవలం గణాంకాలను మాత్రమే ప్రతిబింబించవు అవన్నీ వ్యక్తుల గురించే. సోషల్ మీడియా ప్రపంచం అలసటను కలిగిస్తుందని నిహారిక అంటుంది. “ప్రేక్షకులు దేనితోనైనా విసుగు చెందడం చూసినప్పుడు, లేదా వారు మీ వద్దకు వచ్చి, ‘నేను వేరేది చూడాలనుకుంటున్నాను’ అని చెప్పినప్పుడు, అది చాలా ఒత్తిడిని కలిగిస్తుంది” అని ఆమె అంటుంది. ఆమె సృజనాత్మక ప్రక్రియ, సరిగ్గా చెప్పాలంటే ఒక విశ్వాసంతో కూడిన చర్య. ఆమె చాలా ప్రయాణాలు చేస్తుంది. ముఖ్యంగా తనకు ఆలోచనలు రాక ఇబ్బందిగా అనిపించినప్పుడల్లా రిషికేశ్‌కు వెళ్తుంది. గంగానది ఒడ్డున గంటల తరబడి కూర్చుని ప్రజలను, నీటిని గమనిస్తూ ఉంటుంది. “నేను అక్కడ కూర్చుని ప్రకృతిని గమనించిన ప్రతిసారీ నాకు కొత్త ఆలోచనలు వస్తాయి” అని ఆమె అంటుంది.

ఒక వ్యాపారవేత్తగా మారడం
ఆమె చేతితో తయారు చేసిన ఆభరణాల బ్రాండ్ అయిన ‘డుమ్రూ’ ఆలోచన కేదార్‌నాథ్‌లోనే పుట్టింది. ఆమె రెండేండ్ల కిందట ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. డుమ్రూకు లభించిన స్పందన ప్రోత్సాహకరంగా ఉంది కానీ వచ్చిన ఫీడ్‌బ్యాక్ అంతా సానుకూలంగా లేదని నిహారిక అంటుంది. “నా ప్రేక్షకులు నాకు నిజాయితీతో కూడిన అభిప్రాయాన్ని ఇస్తారు. మొదట్లో నా డిజైన్లు కాస్త బరువుగా ఉండేవి. మహిళలు కాలేజీకి లేదా రోజువారీ కార్యక్రమాలకు ధరించగలిగేలా తేలికైనవి కావాలని అడిగారు. అందుకే నేను తేలికైన శ్రేణిపై పనిచేశాను” అని ఆమె చెప్పింది.
వ్యవస్థాపకత్వం

ఆమెకు ఏమి నేర్పింది?
కంటెంట్ క్రియేషన్ అడగని ఒక విషయాన్ని వ్యవస్థాపకత్వం అడుగుతుందని నిహారిక తెలుసుకుంది. అదే సహనం. “ఒక బ్రాండ్‌తో అయితే అది పూర్తిగా భిన్నమైన వేగం. అనుకున్నట్లుగా రాని నమూనాలు, మార్కెట్ మందగించడం వంటివి ఎదురవుతాయి. మీరు దానిని నిరంతరం పోషిస్తూ ఉండాలి. ఒక సృష్టికర్తగా ఉండటం అంటే మీ వృత్తిని పెండ్లి చేసుకోవడం లాంటిది. అలాగే ఒక బ్రాండ్‌ను కలిగి ఉండటం ఒక బిడ్డను కనడం లాంటిది. మీరు దానిని పెంచి, పోషించి, దానితో పాటు ఎదగాలి” అని ఆమె వివరిస్తుంది.

ట్రోల్స్‌ను ఎదుర్కోవడం
ఒకప్పుడు ప్రతికూల వ్యాఖ్యలు గంటల తరబడి తనను వెంటాడేవని నిహారిక చెబుతుంది. ఆమె తన తల్లితో మాట్లాడి దాని గురించి మధనపడి, బాధపడేది. కానీ కాలక్రమేణా ఆమె ఆ గందరగోళాన్ని పట్టించుకోకుండా ఉండటం, తన తల్లి సలహాను హృదయానికి దగ్గరగా ఉంచుకోవడం నేర్చుకుంది. ఆమ్మ ఎప్పుడూ ఎవరైనా ప్రతికూలంగా ఏదైనా చెప్పినంత మాత్రాన అది నిజం కాదు అనేది’. అందుకే ట్రోల్స్‌‌ను పెద్దగా పట్టించుకోను. అలాగే నిజాయితీగా ఉండటమే ముఖ్యమని, నిజాయితీ మీకు దీర్ఘకాలిక మనుగడను ఇస్తుందని నిహారిక నమ్ముతుంది. “నేను నా ప్రేక్షకులతో నిజాయితీగా ఉంటే, వారు ఎప్పుడూ నాతోనే ఉంటారు. అయితే నేను దేనికి ప్రాతినిధ్యం వహిస్తానో నా ప్రేక్షకులలో అనిశ్చితి ఏర్పడిందని నేను గమనించాను. కాలక్రమేణా నాకు నచ్చని వాటికి ‘కాదు’ అని చెప్పడం, నేను నిజంగా ఉపయోగించే బ్రాండ్‌లతో పనిచేయడం, ప్రతి విషయాన్ని నా ప్రేక్షకులతో పంచుకోవడం నేర్చుకున్నాను” అని ఆమె అంటుంది. ప్రస్తుతం ఆమె లోరియల్, మేబెల్లిన్, లాక్మే, రిలయన్స్ డిజిటల్, శాంసంగ్ వంటి అనేక పెద్ద సంస్థలతో పనిచేస్తుంది. “నేను ప్రారంభించినప్పుడు, నాకు ఎలాంటి విజన్ లేదు, నాకు ఇంత మంది ఫాలోవర్లు ఉంటారని, నేను ఎన్ని ఈవెంట్‌లకు ఆహ్వానించబడతానో, లేదా నేను ఏ బ్రాండ్‌లతో పనిచేస్తానో ఊహించలేకపోయాను” అంటూ ఆమె తన మాటలు ముగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -