- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచెర్ల మానేరులో నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న.. ఐదు ట్రాక్టర్లను సోమవారం కొయ్యుర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేసినట్లుగా కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ప్రభుత్వం నుంచి లేదా సంబంధించిన అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మానేరు, వాగుల్లో ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ-2 రాజన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి, పిసి మధు పాల్గొన్నారు.
- Advertisement -


