ప్రయివేట్ ఏజెన్సీలను
రద్దు చేయాలి : ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికులకు 60 ఏండ్ల తర్వాత నెలకు రూ.9వేల పెన్షన్ ఇవ్వాలని, ప్రయివేట్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని టీయూసీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని వీఎస్టీ పార్క్ నుండి లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. హన్మేశ్, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్. పద్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, ఉపాధ్యక్షులు కేఎస్ ప్రదీప్ , నల్లన్న, గోసు పుల్లయ్య, సహాయ కార్యదర్శులు రాజు, నర్సింహ కోశాధికారి ఆడెపు శంకర్, వెంకటేష్ తదితరులు మాట్లాడారు. సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ ఈ ప్రదర్శన, ధర్నాలో కార్మికులు తమ సమస్యలు, డిమాండ్లను గట్టిగా వినిపిస్తూ నినాదాలు చేశారు. భవన నిర్మాణ కార్మికుల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు 60 సంవత్సరాల తర్వాత కార్డు ఉపయోగపడటం లేదని చెప్పారు. కూలీ పనులు చేసి జీవితాంతం కష్టపడిన కార్మికులు వృద్ధాప్యంలో పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని, కనీస జీవన భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీమా పేరుతో ప్రయివేట్ ఏజెన్సీలను ప్రవేశపెట్టారని, రూ.10 లక్షల బీమా పేరుతో కార్మికుల నుండి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఇదో రకమైన దోపిడీ విధానమని చెప్పారు. ప్రయివేట్ ఏజెన్సీలను వెంటనే రద్దు చేసి, భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారానే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సహజ మరణ పరిహారాన్ని ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. రైతులకు ఇచ్చినట్లే కార్మికులకు కూడా గౌరవప్రదమైన బీమా సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.ఆరోగ్య పరీక్షల పేరిట ప్రయివేట్ ఏజెన్సీలు కార్మికుల నుండి వేల రూపాయలు దోచుకుంటున్నాయని తెలిపారు. సంక్షేమ నిధులు రూ. వందల కోట్లు దారి మళ్లుతున్నాయని చెప్పారు. అందువల్ల వైద్య పరీక్షలు, వైద్య సేవలు ఈఎస్ఐ ద్వారా అందించాలని డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



