ఇండ్ల బిల్లింగ్ కోసం కాంట్రాక్టర్ నుంచి
రూ.50 వేలు లంచం
నవతెలంగాణ – నక్కలగుట్ట
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లు కోసం కాంట్రాక్టర్ నుంచి రూ.50వేల లంచం తీసుకుంటూ ఇరిగేషన్ డీఈఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో సోమవారం జరిగింది. ఏసీబీ డీఎస్‌పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తిలో ఇరిగేషన్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా గంటి శ్రీకాంత్ విధులు నిర్వహిస్తున్నాడు. హన్మకొండ భవానీనగర్‌లోని తన నివాసంలో ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. కొడకండ్ల మండలం కన్వారు గూడెంలో కాంట్రాక్టర్ కర్ర అశోక్‌రెడ్డి 2018లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టాడు. 2021లో నిర్మాణం పూర్తి చేశారు. దానిలో 10 ఇండ్లకు సంబంధించిన 16 లక్షల రూపాయల బిల్లింగ్ ఎంబీ రికార్డ్ 2026 వరకు చేయకుండా ఆపి.. లంచం డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి సదరు అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీకి పట్టుబడిన పాలకుర్తి ఇరిగేషన్ డీఈఈ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


