Tuesday, May 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలురైతుల ధర్నాలు

రైతుల ధర్నాలు

- Advertisement -


రోడ్డుపై ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన
నవతెలంగాణ-విలేకర్లు

ధాన్యం కొనుగోళ్లలో వేగంగా లేకపోవడం, మిల్లులకు తరలించేందుకు లారీలు లేక, గోనె సంచులు లేక రైతులు నెలన్నర రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం సాగు సమయం దగ్గర పడుతున్నా పంట కొనుగోలు చేయక.. పెట్టుబడికి ధాన్యం డబ్బులు అందక ఆందోళనలు చేస్తున్నారు.నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కలిమెర గ్రామంలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెల రోజులు దాటినా కాంటాలు ఆలస్యమవుతుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని దుగినెల్లి రహదారిపై పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకొస్తే తరుగు పేరుతో కొంత, మిల్లులో అన్‌ లోడు కావడం లేదని లారీ వాళ్లు బస్తాకు పది రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం తరలించాలని..
ధాన్యం తరలింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు 63వ నెంబర్‌ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల-చెన్నూర్‌ జాతీయ రహదారిపై బైౖటాయించి నిరసన వ్యక్తం చేశారు. చెన్నూర్‌, భీమారం మండలాల పరిధిలోని వడ్లను వెంటనే కొనుగోలు చేసి రైస్‌ మిల్లులకు తరలించాలని కోరుతూ చెన్నూర్‌ మండలం బావురావుపేట గ్రామసమీపంలో రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -