Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాలలో అభివృద్ధి పనులు పూర్తి

పరకాలలో అభివృద్ధి పనులు పూర్తి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మున్సిపాలిటీ 14వ వార్డులో టియుఎఫ్ఐడిసి ప్రత్యేక నిధులతో రూ. 1 కోటికి పైగా నిధులతో అభివృద్ధి పనులు పూర్తికావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లుగా వార్డు ప్రజలను వేధిస్తున్న అంతర్గత డ్రైనేజీ సమస్య, ముఖ్యంగా శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో నెలకొన్న ఇబ్బందులను మాజీ కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల అవసరాలను గుర్తించిన ఎమ్మెల్యే, శాశ్వత పరిష్కారం కోసం అంతర్గత డ్రైనేజీతో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.కోటితో ప్రతిపాదనలు సిద్ధం చేయించారు.

ఈ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, 2025లో థపెట్కో ప్రత్యేక నిధుల ద్వారా పనులను ప్రారంభించి, ప్రస్తుతం 95 శాతం పూర్తి చేయించారు. ఈ క్రమంలో పాత మసీదు గల్లీలో సీసీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. గతంలో ఈ రోడ్డు కోసం 2024లోనే మున్సిపల్ బడ్జెట్‌లో నిధులు కేటాయించినప్పటికీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయి. దీనిని గమనించిన ఎమ్మెల్యే స్వయంగా చొరవ తీసుకుని, టియుఎఫ్ఐడిసి నిధుల ద్వారా ఆ పనులను పూర్తి చేయించడం పట్ల మాజీ కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డు చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేసిన ఎమ్మెల్యే కృషిని స్థానిక ప్రజలు కొనియాడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -