నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో ఆదివారం తల్లుల దీవెన రోజ (మదర్స్ బ్లెస్సింగ్ డే) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు తమ తల్లులకు పాదపూజ చేసుకొని, దీవెనలు తీసుకున్నారు. పదవ తరగతిలో ఉత్తమ గ్రేడ్ లతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తమ పిల్లలను తల్లులు దీవించారు.
అనంతరం ఉత్తమ తల్లిగా అంగరి అరుణను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు.అంతకుముందు నిర్వహించిన పేరెంట్ ఓరియెంటేషన్ సమావేశంలో పాఠశాల కరస్పాండెంట్ బాలి రవీందర్ విద్యార్థులకు సంబంధించి పలు అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లల చదువుపై దృష్టి సారించాలన్నారు. తమ పిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్లకు, టీవీకి దూరంగా ఉండేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గంటల తరబడి విద్యార్థులు ఫోన్లలో నిమగ్నమై ఉంటే వారు ఫోన్లో ఏం చేస్తున్నా అనే విషయాన్ని తల్లిదండ్రులు తప్పనిసరిగా గమనించి, వాకబు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ స్థాపకులు షఫీ, జిల్లా అధ్యక్షులు గిరి, జిల్లా కోశాధికారి హరీష్, కోనపూర్ ఉప సర్పంచ్ మోర్తాడ్ ఉదయ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.



