హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా “చెన్నై లవ్ స్టోరీ”. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శ కత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తు న్నారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘వదలనే..’ పాటను ఎంఎం కీరవాణి లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్ మాధవపెద్ది సురేష్, కల్యాణి మాలిక్, అనూప్ రూబెన్స్, హరి గౌర, మార్క్ కె రాబిన్, సింజిత్ యెర్రమల్లి, చేతన్ భరద్వాజ్, స్వీకర్ అగస్తీ, సురేష్ బొబ్బిలి, వివేక్ సాగర్, శ్రీచరణ్ పాకాల, తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ,’ఈ పాట నా కెరీర్ లో బెస్ట్ సాంగ్ గా మిగిలిపోతుంది. మణికి, అనంత శ్రీరాంకి థ్యాంక్స్అని తెలిపారు. 'హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ లో ఈ సాంగ్ వస్తుంది. ఆ సందర్భానికి ముందు లిరిక్ రాసి, రవికి వినిపిస్తే, రవి నంబూరి డిఫరెంట్ అప్రోచ్ తో పాట రూపొందించారు. ఇలాంటి పాట తీసుకోవడానికి డైరెక్టర్ కు గట్స్ ఉండాలి. కొన్ని పాటలు చిరకాలం మనసులో నిలిచిపోతాయి. వదలనే అలాంటి సాంగ్ అని ప్రొడ్యూసర్ సాయి రాజేశ్ చెప్పారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,’ఈ సినిమా ఎలాంటి విజయం అందించబోతుందో మాకు తెలుసు. ఈ పాట పిక్చరైజేషన్ పాండిచ్చేరిలో చేశాం. ఈ పాటలో ఫస్ట్ వచ్చిన ఆ సీన్ విజువల్ తెలుగు సినిమాల్లో ఒక ఐకానిక్ సీన్ గా మిగిలిపోతుంది. చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసి బయటకు వచ్చాక ఈ పాట హాంట్ చేస్తూనే ఉంటుంది` అని అన్నారు.
అరుదైన పాటల్లో ఇదొకటి
- Advertisement -
- Advertisement -



