సుందరయ్య మూడో స్మారక ఉపన్యాసంలో చరిత్రకారుడు ప్రొఫెసర్ కెఎన్ గణేశ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో కార్మిక వర్గం ఒక ప్రత్యామ్నాయాన్ని నిర్మించడం అవసరమని చరిత్రకారుడు ప్రొఫెసర్ కె.ఎన్ గణేశ్ అన్నారు. అందుకోసం కార్మిక, రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాల వంటి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. మంగళవారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జిత్ భవన్ లో పి. సుందరయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య మూడో స్మారక ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సామ్రాజ్యవాదం- వ్యవసాయ సమస్య: వామపక్ష అవకాశాలు’ అనే అంశంపై చరిత్రకారుడు ప్రొఫెసర్ కె.ఎన్ గణేష్ మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులు, వ్యవసాయ కార్మికుల బతుకులు ఛిద్రమవుతున్నాయని విమర్శించారు. దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందనీ, మరోవైపు దేశ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేందుకు విదేశాల్లో ఒప్పందాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగం గురించి గానీ, రైతుల సమస్యల గురించి గానీ మాట్లాడటం లేదన్నారు. అదానీ, అంబానీలకు అనుకూలంగా చట్టాలు చేస్తోందని, వారికి బ్యాంకు రుణాలు మాఫీ చేస్తోందని విమర్శించారు. అదే రైతులకు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, సీనియర్ నాయకుడు హన్నన్ మొల్లా, కోశాధికారి పి. కృష్ణప్రసాద్, కేంద్ర కమిటీ సభ్యుడు నిదీష్ విల్లట్ పాల్గొన్నారు.
కార్మిక, రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలతో ప్రత్యామ్నాయం
- Advertisement -
- Advertisement -



