– చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు
నవతెలంగాణ-రాయికల్: మండలంలోని వస్తాపూర్ గ్రామ శివారులోని చెరువులో జేసీబీలతో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి.చెరువు మట్టిని భారీగా తవ్వి డంపులు చేస్తున్నప్పటికీ సంబంధిత ఇరిగేషన్ అధికారులు మాత్రం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్థులు పలుమార్లు అధికారులకు సమాచారం అందించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదులు చేసినా అధికారులు “మామూలు”గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.చెరువుల పరిరక్షణ బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అక్రమ తవ్వకాలను నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
చెరువులో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



