Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జర్నలిస్ట్ శ్రీరామ్ రమేష్ మృతి

జర్నలిస్ట్ శ్రీరామ్ రమేష్ మృతి

- Advertisement -

నవతెలంగాణ – వర్ధన్నపేట : వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన శ్రీరామ్ రమేష్ (60) ఓ పత్రికకు చెందిన జర్నలిస్టు గుండె పోటుతో మృతి చెందారు. గత 25 సంవత్సరాలుగా జర్నలిస్టుగా సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందారు. చార్ధామ్ పర్యటన ముగించుకుని తిరిగి వస్తుండగా ఆస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ వద్ద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందిన శ్రీరాం రమేష్ మృతిపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలతో పాటు ప్రజాసంఘాలు పలు పార్టీలకు చెందిన నాయకులు అభిమానులు వారి సానుభూతిని వ్యక్తం చేశారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -