Thursday, May 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధం మొదలయ్యే అవకాశాలు తక్కువే

యుద్ధం మొదలయ్యే అవకాశాలు తక్కువే

- Advertisement -

సిద్ధంగానే ఉన్నాం : ఇరాన్
టెహ్రాన్/వాషింగ్టన్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అమెరికాతో తిరిగి యుద్ధం మొదలయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, అయినప్పటికీ ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేం దుకు సిద్ధంగానే ఉన్నామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నౌకాదళ అధికారి మహమ్మద్ అక్బర్ జదేహ్ చెప్పారు. శత్రువుల బలహీనపడినందున యుద్ధం జరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, అయినా తమ సాయుధ దళాలు పూర్తి ఆయుధ సంపత్తితో సర్వ సన్నద్ధంగా ఉన్నాయని వివరించారు. దాడులకు అమెరికా తెగబడితే ఛాబహార్ నుంచి మహ్‌షహర్ వరకూ మొత్తం ప్రాంతాన్ని మరుభూమిగా మారుస్తామనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు. కాగా ఇరాన్ అనుమతితో గత 24 గంటల కాలంలో చమురు ట్యాంకర్లు సహా ఇరవై ఐదు వాణిజ్య నౌకలు హార్ముజ్‌ను దాటాయని ఐఆర్‌జీసీ తెలిపింది. హార్ముజ్‌పై తమ ‘ఇంటెలిజెన్స్ నియంత్రణ’ కొన సాగుతోందని, దుందుడుకు చర్య లకు దిగితే తీవ్రమైన ఎదురు దెబ్బలు తప్పవని చెప్పింది. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయిల్ దళాలు బాంబు దాడులతో విరుచుకు పడుతున్నాజ్బుదక్షిణ లెబనాన్‌పై మంగళవారం ఇజ్రాయిల్ దళాలు జరిపిన దాడులలో నలుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు సహా 31 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా గాయపడ్డారు. హిజ్బుల్లాతో ఒప్పం దం అమలులో ఉన్నప్పటికీ దాడులను ఉధృతం చేశానని ఇజ్రాయిల్ తెలిపింది.

ట్రంప్‌ పై సెనెటర్ ఆగ్రహం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కొత్తగా యుద్ధాన్ని మొదలు పెట్టారని సెనెటర్ మార్క్ వార్నర్ విమర్శించారు. ఇరాన్‌లో అమెరికా సైనిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని ఆయన చెప్పారు. హామీలను ఉల్లంఘిస్తూ ఖజానాపై భారం మోపుతున్న ట్రంప్‌పై మండిపడ్డారు. ‘యుద్ధం ముగియబోతోందని ట్రంప్ చెప్పారు. కానీ వాస్తవమేమంటే అమెరికా ఇప్పటికీ ఇరాన్‌పై దాడి చేస్తూనే ఉంది. ఇచ్చిన ప్రతి హామీని ట్రంప్ తుంగలో తొక్కారు. కొత్తగా యుద్ధాన్ని మొదలు పెట్టారు. దీంతో ప్రతి దాని పైన ఖర్చులు పెరిగిపోయాయి’ అని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -