చర్చల విఫలమైతే మళ్లీ సైనిక దాడులే : ట్రంప్
వాషింగ్టన్ : ఇరాన్‌తో చర్చలు బాగా జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే చర్చలు విఫలమైతే ఇరాన్‌పై తిరిగి సైనిక దాడులు మొదలవుతాయని హెచ్చరించారు. ‘మా మధ్య చర్చలు బాగా జరుగుతున్నాయి. ఒప్పందం కుదిరేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అయితే అది కుదరని పక్షంలో రెండు రోజుల క్రితం మేము ఏం చేశామో ఆ పనే చేస్తాం’ అని ఆయన విలేకరులతో అన్నారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే మిచిగాన్‌లో జరిగిన ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తూ స్వరం పెంచారు.
ఇరాన్‌కు ‘లంచం’ ఇవ్వలేమని, దౌత్యం ఫలించకపోతే వారిని అమెరికా చిత్తుగా ఓడిస్తుందని చెప్పారు. సౌదీ అరేబియా, ఇరాక్, జోర్డాన్‌లపై సోమవారం డ్రోన్ దాడులు జరిగాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం ఆయుధ కొరతను ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలను ట్రంప్ తోసిపుచ్చారు. ఆయుధ నిల్వలను వేగవంతంగా పెంచుకుంటున్నామని, తాము మరింత ఆధునిక ఆయుధ వ్యవస్థలను కోరుకుంటున్నామని ట్రంప్ చెప్పారు.
ఒప్పందం కుదిరే అవకాశం ఉంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



