శాసనసభ కమిటీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కమిటీల పాత్ర చాలా గొప్పదని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అని చెప్పారు. శాసనసభ సమావేశాల సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడాల్సిన బాధ్యత హామీల కమిటీపై ఉందన్నారు. ఆ దిశగా పని చేయాలని సూచించారు. నియామాల కమిటీ శాసనసభ సక్రమమైన, సమర్ధవంతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన నిర్వాహణలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నదని చెప్పారు.శాసనసభ చట్టాల ద్వారానే కాకుండా ఆ చట్టాలను రూపొందించే సభ్యుల ప్రవర్తన, నిబద్ధత మరియు వ్యవహార శైలి ద్వారా కూడా అంచనా వేయబడుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని శాసనసభ భవనంలో స్పీకర్ ఛాంబర్ లో శాసనసభ ప్రభుత్వ హామీల అమలు కమిటీ, శాసనసభ నియమాల కమిటీ, శాసనసభ యొక్క నైతిక విలువల కమిటీల స్పీకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడం, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల నమ్మకాన్ని బలోపేతం చేయడం అనే ఉద్యేశ్యంతోనే ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంటరీ వ్యవస్థలో నైతిక విలువల కమిటీ అనే వ్యవస్థ అభివృద్ధి చెందిందన్నారు. రాగద్వేషాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా కమిటీలు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ శాసనసభలో సభ్యులకు మొదట ఇచ్చేది రూల్స్ బుక్, దానికి అనుగుణంగా స్పీకర్ శాసనసభను నడుపుతారని తెలిపారు. గత ప్రభుత్వంలో రూల్స్ బుక్ ను మార్చివేశారన్నారు. శాసనసభను సమర్ధవంతంగా నడపడానికి కమిటీ అధ్యక్షులు, సభ్యులు కలిసి నూతన నిబంధనలతో రూల్స్ బుక్ ను రూపొందించాలని సూచించారు. శాసనసభ కమిటీలు ఇతర రాష్ట్రాలలో కూడా స్టడీ టూర్ చేసి ఆయా రాష్ట్రాల శాసనసభల్లో అమలవుతున్న నిబంధనలను పరిశీలించాలని, వారి సలహాలను తీసుకోవాలని సూచించారు. సభలో నియమాలను పాటించే విధంగా చూడడంతో పాటుగా, సభ హుందాతనాన్ని కాపాడడంలో విలువల కమిటీది కీలక పాత్ర అని గుర్తు చేశారు. ఎథిక్స్ కమిటీ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా ఉండే విధంగా ఎథిక్స్ కమిటీ సూచనలు ఉండాలని సూచించారు. సమావేశంలో శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మెన్ పటోళ్ల సంజీవరెడ్డి, సభ్యులు జె. అనిరుధ్ రెడ్డి, జారే ఆదినారాయణ,రూల్స్ కమిటీ సమావేశానికి సభ్యులు దానం నాగేందర్, తూడి మెఘారెడ్డి, భూక్యా మురళి నాయక్, శాసనసభ నైతిక విలువల కమిటీ చైర్మెన్ రేవూరి ప్రకాష్ రెడ్డి, సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి, మండలి కార్యదర్శి డా. వి నరసింహా చార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి పాల్గొన్నారు.
కమిటీల పాత్ర గొప్పది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



